: మీ ఆధార్ కార్డు చెల్లుబాటా? కాదా?... చెక్ చేసుకోండిలా!
యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఇప్పటివరకూ పలు కారణాలతో 81 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్ మెంట్ లోని నిబంధనల కింద వీటిని చెల్లుబాటు కాకుండా చేసినట్టు తెలిపింది. ఇక ఈ జాబితాలో మీ ఆధార్ కార్డు ఉందా? అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ ను సందర్శించాల్సి వుంటుంది.
https://resident.uidai.gov.in/aadhaarverification
ఈ వెబ్ లింక్ కు వెళ్లి, అక్కడ 12 అంకెల ఆధార్ సంఖ్యను, ఆపై సెక్యూరిటీ కోడ్ ను టైప్ చేయాలి. ఆ తరువాత వెరిఫై బటన్ ను నొక్కితే, మీ కార్డు యాక్టివ్ గా ఉందా? లేక డీయాక్టివేట్ అయిందా? అన్న విషయం తెలుస్తుంది. యాక్టివ్ గా ఉంటే, మీ వయసు, రాష్ట్రం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఆధార్ చెల్లుబాటులో లేకుంటే, స్క్రీన్ పై ఎటువంటి వివరాలూ కనిపించవు.