: కలకలం రేపుతున్న డీఎస్ కుమారుడి పత్రికా ప్రకటన!

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పార్టీ మారుతున్నారనే వదంతులకు మరింత బలం చేకూరే ఘటన చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు అరవింద్ ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన ఓ భారీ ప్రకటన తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనానికి దారి తీసింది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా 'జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి' అంటూ అరవింద్ ప్రకటన ఇచ్చారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమిపాలైన డీఎస్ ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా డీఎస్ ను కేసీఆర్ నియమించారు. ఆ తర్వాత ఆయనకీ రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. అయితే, ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ లో డీఎస్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. కొన్ని నెలల క్రితం డీఎస్ ప్రధాన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరారు. తాజాగా అరవింద్ ప్రకటనతో... డీఎస్ బీజేపీలో చేరబోతున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే, తాను పార్టీ మారడం లేదని ఇంతకు ముందే డీఎస్ స్పష్టం చేశారు. 

More Telugu News