pavan: పవన్ న్యూ మూవీ టైటిల్ అదేనా?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ అనగానే సహజంగానే ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. అలాంటిది ఆ సినిమా పవన్ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచే 25వ మూవీ కావడం మరింత ఆసక్తిని కలిగించే విషయం. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. దాంతో ఫలానా టైటిల్ అనుకుంటున్నారు అనే వార్తలు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తున్నాయి.

 'దేవుడే దిగివచ్చినా' .. 'గోకుల కృష్ణుడు' వంటి టైటిల్స్ పరిశీలనలో వున్నట్టుగా చెప్పుకున్నారు. తాజాగా 'రాజు వచ్చినాడు' అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది. దాదాపు ఈ టైటిల్ ఖరారు కావొచ్చని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తేనే గానీ నమ్మలేం. పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ సస్పెన్స్ కి తెరపడనుంది .. ఎందుకంటే ఆ రోజున ఫస్టులుక్ రానుంది మరి.   
pavan
trivikram

More Telugu News