: తెలంగాణలోనూ పోటీ చేస్తా: గవర్నర్ తో పవన్ కల్యాణ్
2019 ఎన్నికలకు గాను జనసేన పార్టీ పూర్తి స్థాయి క్లారిటీతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఏపీలో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న జనసేన... తెలంగాణపై కూడా దృష్టి సారిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా తన కార్యాచరణను రూపొందించుకుంటోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ నివాసం రాజ్ భవన్ లో నిన్న జరిగిన తేనీటి విందు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ తో పవన్ మాట్లాడుతూ, తెలంగాణలో కూడా పోటీ చేస్తానని చెప్పారు.