: 250 కోట్ల పింక్ డైమండ్ డీల్... నువ్వు దొంగంటే, నువ్వు దొంగటూ వ్యాపారుల తకరారు...నాలుగు దేశాల సమస్య!


భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా వాసులు జునైద్‌ మోతీ, అతడి తండ్రి అబ్బాస్‌ అబూ బాకర్‌ మోతీ, వారి అనుచరులు ఆష్రఫ్ కాకా, సలీం బోబట్‌ లు 250 కోట్ల రూపాయల విలువైన అరుదైన పింక్ డైమండ్‌ తమ వద్ద ఉందని, దానిని అమ్మి పెట్టాలని రష్యాకు చెందిన టెలీకమ్యూనికేషన్‌ టైకూన్‌ అలిబెక్‌ ఇసాయెవ్‌, రష్యాకే చెందిన సిల్లా మౌసా అనే అంతర్జాతీయ డైమండ్‌ డీలర్లతో డీల్‌ కుదుర్చుకున్నారు. దీంతో ఆ డైమండ్‌ ను రష్యాలో అమ్మిస్తానని చెప్పి ఇసాయెవ్‌ ఆ వజ్రానికి సంబంధించిన పేపర్లను తీసుకున్నాడు. ఇప్పుడు ఆ డైమండ్‌ తననుంచి నలుగురు భారత సంతతి ఆఫ్రికన్లు తీసుకున్నారని సిల్లా మౌసా ఆరోపిస్తున్నాడు.

దీంతో వివాదం రేగింది. డైమండ్ కు సంబంధించిన పేపర్లున్న అలిబెక్ ఇసాయెవ్ వజ్రం తనదని అంటూ పేపర్లు చూపిస్తున్నాడు. అంతే కాకుండా భారత సంతతికి చెందిన ఆఫ్రికా వ్యాపారులు తన నుంచి చోరీ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. భారత సంతతికి చెందిన నలుగురూ పింక్ వజ్రం తమదని, తమ నుంచి మౌసా కాజేశాడని ఆరోపిస్తున్నారు. మౌసా మాత్రం డైమండ్ తన నుంచి ఆ నలుగురూ ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో డైమండ్ తమదంటే తమదంటూ ఫ్రాన్స్‌, లెబనాన్‌, జింబాబ్వే, దుబాయ్‌ దేశాల న్యాయస్థానాల్లో వివాదం నడుస్తోంది. అయితే ఇంకా ఆ నోటీసులు తమకు అందలేదని భారత సంతతికి చెందిన నలుగురూ చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News