: గువాంపై ఇప్పట్లో దాడి చేయం: ప్రకటించిన ఉత్తరకొరియా న్యూస్ ఏజెన్సీ

గువాం ద్వీపంపై ఇప్పట్లో దాడి చేసే అవకాశాలు లేవని ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) పేర్కొంది. గువాం ద్వీపంలోని అమెరికాకు చెందిన అండర్సన్ ఎయిర్‌ ఫోర్స్ బేస్‌ పై దాడి చేస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెండు వారాల క్రితం ఆయన దాడుల గురించి చర్చలు జరుపుతుండగా తీసిన ఫోటోలు కూడా వెలువడ్డాయి.

అయితే ప్రస్తుతం ఆయన ఆ ఆలోచన నుంచి విరమించుకున్నారని కేసీఎన్ఏ తెలిపింది. దాడుల గురించి ప్రణాళికలు రచించిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు గువాం ద్వీపంపై దాడి చేసే ఉద్దేశం కిమ్‌ కు లేదని ఆ పత్రిక తెలిపింది. కాగా, అమెరికా దాడులకు సిద్ధమని ప్రకటనలు చేయడానికి తోడు చైనా తీరుపై మండిపడుతూ, ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఎగుమతులు, దిగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. పూర్తిగా చైనాపై ఆధారపడిన ఉత్తరకొరియా ఈ ఆంక్షలతో దిగివచ్చినట్టు తెలుస్తోంది. 

More Telugu News