: ఎమ్మెస్కే ప్రసాద్ ను తిట్టిపోస్తున్న ధోనీ అభిమానులు
టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ను ధోనీ అభిమానులు తిట్టిపోస్తున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన సందర్భంగా 2019 వరల్డ్ కప్ కు జట్టు ఎంపికపై ఎమ్మెస్కే మాట్లాడుతూ, యువీకి స్థానం కల్పించకపోవడం వెనుక కారణం కాంబినేషన్లు ప్రయత్నించడమని అన్నారు. అతనికి కెరీర్ ఇంకా ముగిసిపోలేదని, టెన్నిస్ లో ఆండ్రీ అగాసీలా ఇంకా రాణించగలడని చెప్పారు.
ఇక ధోనీ గురించి చెబుతూ, ధోనీ గత సిరీస్ లో సరిగ్గా ఆడలేదని, ఈ సారి కూడా సరిగ్గా ఆడకపోతే సరైన ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు. దీంతో ఎమ్మెస్కే ప్రసాద్ పై ధోనీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ధోనీ ముందు నువ్వెంత? అతన్నే టీమ్‌లో నుంచి తీసేస్తావా? అని ఎమ్మెస్కేను నిలదీస్తున్నారు. ఇంకొందరు అభిమానులు ఎమ్మెస్కే క్రికెట్ రికార్డులను బయటకు తీసి మరీ చీఫ్ సెలక్టర్ గా నిన్నెలా ఎంపిక చేశారు? ధోనీని తీసేయడానికి నీకున్న అర్హత ఏంటి? అంటూ తిట్టిపోస్తున్నారు.