: బోఫోర్స్ కుంభకోణం కంటే నలభై రెట్లు అవినీతి జరుగుతోంది: బీజేపీ నేత నాగం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో బోఫోర్స్ కుంభకోణం కంటే నలభై రెట్లు అవినీతి జరుగుతోందని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్ని లేఖలు రాసినా ఎటువంటి స్పందనా లేదని, అవినీతిలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపించారు. అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని, తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ధమేనని అన్నారు. ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ ఈరోజు చేసిన ప్రకటనలో ఎటువంటి వాస్తవం లేదని, నిరుద్యోగుల విషయంలో ఆయనకు చిత్తశుద్ధి లేదని అన్నారు.