: నేడు గవర్నర్ తేనీటి విందుకు హాజరు కానున్న పవన్ కల్యాణ్!


నేటి సాయంత్రం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలవనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు గవర్నర్ తేనీటి విందును ఇవ్వనుండగా, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కు ఆహ్వానం వెళ్లింది. గవర్నర్ ఆహ్వానంపై స్పందించిన పవన్, తాను హాజరవుతానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, ప్రతిపక్ష పార్టీల నేతలు, ఉన్నతాధికారులకు గవర్నర్ కార్యాలయం ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News