: 'మీసం తిప్పరా... ఇది ఇండియా' అన్న హీరో రామ్!


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతి యావత్తూ ఘనంగా జరుపుకుంటున్న వేళ, టాలీవుడ్ సినీ ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభినందనలు తెలుపుతూ ఉత్తేజ పరిచే వ్యాఖ్యలు చేశారు. "‘తిప్పరా మీసం, భారతదేశం గర్వించాల్సిన క్షణం ఇది" అని హీరో రామ్ పేర్కొనగా, "కేవలం కొత్త సంవత్సరాల నాడు మాత్రమే కొత్త నిర్ణయాలు తీసుకోవడం కాదు. మన స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా కొత్త నిర్ణయం తీసుకోవాలి. సమాజం కోసం ఏదైనా చేద్దాం" అని 'ఆనందోబ్రహ్మ' హీరోయిన్ తాప్సి, "మన జాతీయ జెండా మరింతగా పైకి ఎగరాలి. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు" అని మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

"స్వేచ్ఛ వెలకట్టలేనిది. దాన్ని గౌరవిద్దాం. ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని ప్రిన్స్ మహేశ్‌ బాబు. "హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే" అని సింపుల్ గా ఎన్టీఆర్‌, "నా మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ అభినందనలు" అని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. "నేడు స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశానికి సెల్యూట్‌ చేద్దాం" అని మిల్కీ బ్యూటీ తమన్నా, "స్వేచ్ఛ మన హక్కు. ఈ హక్కును మనకందించిన సమరయోధులకు సెల్యూట్‌ చేద్దాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని హీరో కల్యాణ్‌ రామ్‌ స్పందించారు.

  • Loading...

More Telugu News