: కేరళలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు అవమానం!
కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కు అవమానం జరిగింది. భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభవేళ, పాలక్కాడ్ లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసేందుకు వచ్చిన ఆయన్ను అధికారులు అడ్డుకున్నారు. మోహన్ భగవత్ ను అడ్డుకోవాలని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఓ పాఠశాలలో పతాకావిష్కరణ నిమిత్తం ఆయన రాగా, అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు ఆయన్ను నిలువరించారు.
పాఠశాలల్లో అక్కడి అధికారులు మాత్రమే జెండాలను ఎగురవేయాలని, ఆ సమయంలో ప్రజా ప్రతినిధులను అనుమతిస్తామే తప్ప, వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు అనర్హులని కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొనడం గమనార్హం. తనను అడ్డుకోవడంపై మోహన్ భగవత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనకు మద్దతుగా స్థానిక బీజేపీ నేతలు కూడా కలవడంతో పాలక్కాడ్ లో కొంత ఉద్రిక్తత నెలకొంది.