: నవాజ్ సతీమణిపై నిషేధిత ఉగ్రవాద సంస్థ జేయూడీ పోటీ.. ఇటీవలే రాజకీయ పార్టీగా మారిన జమాత్-ఉద్-దవా!


ఇటీవలే జేయూడీ పేరుతో రాజకీయ పార్టీగా మారిన పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సవాలు విసిరింది. పనామా పేపర్స్ కుంభకోణంలో పదవి కోల్పోయిన షరీఫ్ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో తొలిసారి జేయూడీ బరిలోకి దిగుతోంది. షరీఫ్ తన సతీమణి కుస్లూం (60)ని బరిలోకి దింపుతుండగా జేయూడీ ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టింది.

ముంబై దాడుల సూత్రధారి అయిన జేయూడీ చీఫ్ హఫీజ్ సయాద్ ఈనెల 7న ఇస్లామాబాద్‌లో ‘మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పేరుతో రాజకీయ పార్టీని రిజిస్టర్ చేశాడు. ఎన్ఏ-120 సీటు కోసం జరగనున్న ఉప ఎన్నిక కోసం పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) తరపున కుస్లూం నామినేషన్ దాఖలు చేశారు. ఎంఎంల్‌కు చెందిన ఖరీ యాకోబ్ షేక్ ఆమెపై పోటీకి దిగారు. ఎంఎంల్ ఇంకా ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ కాకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పాక్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా, శుక్రవారం ఎన్నిక జరగనుంది.

  • Loading...

More Telugu News