arjun: ఇంకా హీరోగానే చేయాలంటే కష్టమే : యాక్షన్ కింగ్ అర్జున్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ సినిమాల దుమ్ము దులిపేసిన హీరో అర్జున్. అందుకే అంతా ఆయనని యాక్షన్ కింగ్ అనే పిలుచుకుంటూ వుంటారు. అలాంటి అర్జున్ రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన 'లై' సినిమాతో విలన్ గా మారిపోయారు. అలాంటి పాత్రను అంగీకరించడానికి కారణమేమిటని ఆయనను అడిగితే, తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

ఇంతవరకూ తాను 150కి పైగా సినిమాలు చేశాననీ .. ఇంకా హీరోగానే కొనసాగాలంటే కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారనీ, అందుకు తగిన విధంగా కనిపించడానికి ప్రయత్నించవలసిందేనని అన్నారు. అలా డిఫరెంట్ గా ట్రై చేద్దామనే ఉద్దేశంతోనే ఈ పాత్రను ఒప్పుకున్నానని చెప్పారు. ప్రీక్షకులు ఆదరిస్తోన్న తీరు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఇకపై ఇలా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
arjun

More Telugu News