: సుభాష్ చంద్రబోస్ జీవితకథతో వెబ్‌సిరీస్... ఫస్ట్‌లుక్ విడుదల!
స్వాతంత్ర్యవిప్లవ యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే! ఈ నేపథ్యంతోపాటు ఆయన జీవితకథ ఆధారంగా త్వరలో ఓ వెబ్‌సిరీస్ రానుంది. `బోస్: డెడ్ ఆర్ అలైవ్` అనే పేరుతో వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో బోస్‌గా విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నాడు. బోస్ వేషధారణతో కూడిన ఫస్ట్ లుక్ ను వెబ్‌సిరీస్ నిర్మాత ఏక్తాకపూర్ తాజాగా విడుదల చేసింది. ఈ వెబ్‌సిరీస్‌కి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. దీని పూర్తి ట్రైలర్‌ను ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు ఏక్తా ఇన్‌స్టాగ్రాంలో తెలిపింది. ఈ సిరీస్ ఏక్తాకపూర్‌కు చెందిన `ఏఎల్‌టీ బాలాజీ` వెబ్ ఛానల్‌లో ప్రసారం కానుంది.