: కోచింగ్ డబ్బుల కోసం డ్రగ్ సప్లయర్‌గా మారిన మహిళ!
బీఈడీ చదివిన ముత్తెం బబితా, డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగం సంపాదించాలనుకుంది. ఉపాధ్యాయ ఉద్యోగానికి ఉన్న పోటీని గుర్తించి, అందులో గెలవడానికి కోచింగ్ తీసుకోవాలనుకుంది. కానీ పేదరికం వెక్కరించడంతో కోచింగ్ డబ్బుల కోసం మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఆ పనిలో అనుభవం లేకపోవడంతో పోలీసులకు పట్టుబడింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బబితా, తన సోదరుడు సునీల్ కుమార్, మరో వ్యక్తి బిద్యాసాగర్ సింగ్‌లు రూ. 15 లక్షల విలువగల 100 కేజీల గంజాయితో సికింద్రాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన కొన్ని రోజులకే భర్త వదిలేయడంతో చదువుకోవడానికి డబ్బుల్లేక ఈ పనికి ఒప్పుకున్నట్లు బబితా అంగీకరించింది. వీరంతా కలిసి విశాఖపట్నం నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కి ఈ మాదకద్రవ్యాలను సరఫరా చేయాల్సిఉంది. ఈ పని విజయవంతంగా పూర్తి చేస్తే వారికి ఒక్కొక్కరికి రూ. 5000 ఇస్తారని, ఆ డబ్బుకోసమే ఈ పనికి ఒప్పుకున్నట్లు చెప్పింది.