: పాన్‌కు, ఆధార్‌కు లంకె కుదిరింది.. 9.3 కోట్ల మంది అనుసంధానం!


పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే కార్డులు చెల్లకుండా పోతాయన్న ప్రభుత్వ ప్రకటనతో కోట్లాదిమంది ముందుకొచ్చారు. ఇప్పటి వరకు 9.3 కోట్ల మంది తమ పాన్‌కార్డులను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకున్నట్టు ఆదాయపన్ను అధికారులు తెలిపారు. జూన్, జూలై నెలల్లో మూడు కోట్ల మంది పాన్-ఆధార్ లింక్ చేసుకోగా ఆగస్టు ఐదో తేదీ నాటికి ఆ సంఖ్య 9.3 కోట్లకు చేరినట్టు తెలిపారు. దేశంలో మొత్తం 30 కోట్ల మంది పాన్‌కార్డులు కలిగి ఉన్నారని, వారిలో ఇప్పటి వరకు 30 శాతం (9.3 కోట్లు) మంది ఆధార్‌తో తమ పాన్ కార్డులను అనుసంధానం చేశారని వివరించారు. పాన్‌కార్డు-ఆధార్‌కార్డు అనుసంధానానికి ఈ నెల 31 చివరి రోజు.

  • Loading...

More Telugu News