anushka: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  'ఒక మంచి సినిమాలో భాగం కావాలన్నదే మొదటి నుంచీ నా తపన' అంటోంది అందాలభామ అనుష్క. "నేను మొదటి నుంచీ కూడా కథకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాను. ఒక మంచి కథతో రూపొందే సినిమాలో భాగం కావాలన్నదే నా కోరిక. అందుకే కథకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఇతర అంశాలను అంతగా పట్టించుకోను. అదే నాకు పేరు తెచ్చిపెడుతోంది" అని చెప్పింది.      
*  'స్పైడర్' చిత్రం కోసం చివరి పాటను ఈ నెల 23 నుంచి రొమేనియాలో చిత్రీకరిస్తారు. మహేశ్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ పై నయనానందకరంగా ఈ పాటను చిత్రీకరించడానికి దర్శకుడు మురగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెల 27న చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.
*  విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'అర్జున్ రెడ్డి చిత్రం' ద్వారా జబల్ పూర్ కు చెందిన శాలిని పాండే అనే అమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది. విశేషం ఏమిటంటే, తన తొలితెలుగు చిత్రంలోనే తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆమె రెడీ అవుతోంది.  
anushka
mahesh

More Telugu News