: ఈ సినిమా చూశాక విక్టరీ వెంకటేశ్ కి నిద్ర పట్టలేదు: దర్శకుడు తేజ
తేజ దర్శకత్వంలో యంగ్ హీరో రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. రానా బాబాయి వెంకటేశ్ ఈ సినిమాకి ఫిదా అయిపోయారని దర్శకుడు తేజ చెప్పారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసిన తరువాత వెంకటేశ్ థియేటర్ బయట పెద్దగా ఏమీ మాట్లాడకుండానే వెళ్లారు. అయితే, అదే రోజు రాత్రి 10 గంటలకి నాకు ఫోన్ చేశారు. రానాకి ఓ మంచి హిట్ మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాలోని సన్నివేశాలు కళ్లముందు కదలాడుతోంటే నిద్ర పట్టడంలేదని వెంకటేశ్ అన్నారు’ అని తేజ హర్షం వ్యక్తం చేశారు.