: స్త్రీ వేషధారణలో వచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన పెళ్లి కొడుకు!


పెళ్లికి వ‌చ్చిన బంధువుల ముందుకు స్త్రీ వేష‌ధార‌ణ‌తో వ‌చ్చి ఓ పెళ్లికొడుకు ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన ఘ‌ట‌న ఖమ్మం జిల్లాలోని బోనకల్లులో చోటుచేసుకుంది. అక్క‌డి చొప్పకట్లపాలెంలో కాటేపల్లి పుల్లయ్య కుమారుడు కాటేపల్లి చంద్రశేఖర్‌కి వివాహం నిశ్చ‌య‌మైంది. కృష్ణాజిల్లా అనిగండ్లపాడుకు చెందిన కృష్ణవేణి మెడ‌లో మూడుముళ్లు వేసిన అనంత‌రం స‌ద‌రు పెళ్లికొడుకు కుటుంబ ఆచారం ప్రకారం చీర క‌ట్టుకుని స్త్రీ వేషధారణలో ముత్యాలమ్మ గుడికి బ‌య‌లుదేరాడు. నేల‌కు పెళ్లికొడుకు కాలు తాక‌కుండా ఇంటి వద్ద నుంచి పట్టువస్త్రాల‌ను వీధుల్లో పరచారు. వాటిపై న‌డుచుకుంటూ ఆ పెళ్లికొడుకు ముత్యాలమ్మ గుడికి చేరుకుని మొక్కులు చెల్లించాడు.  

  • Loading...

More Telugu News