: ఉగ్రవాదం వైపు కశ్మీరీ యువత అమితాసక్తి.. ఈ ఏడాది ఇప్పటికే తుపాకీ పట్టుకున్న 70 మంది
ఉగ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్న కశ్మీరీ యువకుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంది. 2017 మొదటి ఏడు నెలల్లోనే ఉగ్రవాదులతో చేరిపోయిన వారి సంఖ్య 70కి చేరింది. 2016 మొత్తం మీద ఉగ్రవాదులుగా మారిన వారు 88 మందే. 2015లో 66, 2014లో 53 మంది ఉగ్రవాదం బాట పట్టినట్టు భద్రతా బలగాల నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ఉగ్రవాదం వైపు వెళ్లిన 70 మందిలో ఎక్కువ మంది పుల్వామా, షోఫియాన్, కుల్గామ్ జిల్లాల నుంచే ఉన్నారు. ఈ జిల్లాలో టెక్నాలజీ తెలిసిన యువత ఎక్కవగా ఉండడంపై ముష్కరులు ఈ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు.