: జిమ్నా స్టిక్ స్టంట్ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన దక్షిణాఫ్రికా బాడీ బిల్డర్ తబేత్!


దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ సిఫిసో లున్జెలో తబేత్ (23) ప్రాణాలు కోల్పోయాడు. జిమ్నాస్టిక్ స్టేడియంలో బ్యాక్ ఫ్లిప్ చేస్తూ కిందకు ల్యాండ్ అయ్యే సందర్భంలో బ్యాలెన్స్ కోల్పోయిన తబేత్ కుప్పకూలిపోయాడు. వెంటనే, ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.

జిమ్నాస్టిక్ స్టేడియంలోని మ్యాట్ మధ్యలోకి వెళ్లి  వెనుక వైపు నుంచి గాల్లోకి ఎగిరి ల్యాండ్ అవుతుండగా బ్యాలెన్స్ తప్పడంతో, అతని బరువు మొత్తం మెడ భాగంలో పడటంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతను మృతి చెందినట్టు  వైద్యులు తెలిపారు. కాగా, 75 కిలోల కేటగిరిలో తబేత్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్ నెస్ (ఐఎఫ్ బీబీ) జూనియర్ వరల్డ్ ఛాంపియన్.    

  • Loading...

More Telugu News