: హిందీ 'బిగ్ బాస్'లో నియా శర్మకు ఎంతిస్తున్నారో తెలిస్తే కళ్లు తేలేస్తారు!


భారత దేశ టీవీ షోలలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ అన్నిటికన్నా టాప్ లో ఉంది. ఈ రియాల్టీ షో రేటింగ్ లు ఇతర షోలకు సవాల్ విసురుతున్నాయి. అక్టోబర్ లో ఈ రియాల్టీ షో 11వ సీజన్ ప్రారంభంకాబోతోంది. ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయంలో ప్రేక్షకులు ఉత్సుకతకు గురవుతున్నారు. కంటెస్టెంట్ల పేర్లతో ఓ లిస్ట్ బయటకు వచ్చినప్పటికీ వీరి పేర్లను బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, 'జమై రాజా' బాలీవుడ్ మూవీలో నటించిన నియా శర్మకు ఈ షోలో కంటెస్ట్ చేయడానికి ఏకంగా రూ. 2 కోట్లు ఆఫర్ చేశారనేది సంచలనంగా మారింది. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది.

  • Loading...

More Telugu News