: జగన్ సీఎం అయ్యేదీ, లేనిదీ నంద్యాలపైనే ఆధారపడి ఉంది: శిల్పా చక్రపాణి రెడ్డి


నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే జగన్ వ్యాఖ్యలను టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అనే విషయం నంద్యాల ఎన్నికపైనే ఆధారపడి ఉందని అన్నారు. శిల్పా కుటుంబంపై నంద్యాల ఓటర్లకు ఎంతో నమ్మకం ఉందని చెప్పారు. తన సోదరుడు మోహన్ రెడ్డి కోసం టీడీపీ ఎమ్మెల్సీ పదవికి కూడా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అతని రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు. ఉప ఎన్నిక తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News