'వీఐపీ 2'లో ధనుష్ అదరగొట్టేశాడట!
తమిళంలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు మొదటిభాగం మాదిరిగానే సాగినా .. నటన విషయంలో ధనుష్ అదరగొట్టేశాడని అంటున్నారు. ధనుష్ ..కాజోల్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. ఆశించిన స్థాయి వసూళ్లను ఈ సినిమా తెచ్చిపెట్టేదిలానే ఉందని అంటున్నారు. ఇక తెలుగు వెర్షన్ ను ఎప్పుడు రిలీజ్ చేసేది త్వరలోనే ప్రకటించవచ్చని తెలుస్తోంది.