: ముద్రగడ పాదయాత్ర.. సేమ్ సీన్ రిపీట్!
ఛలో అమరావతి పాదయాత్రకు కాపు నేత ముద్రగడ పద్మనాభం బయల్దేరడం... పోలీసులు అడ్డుకోవడం సర్వసాధారణ అంశంగా మారింది. ప్రతి రోజులాగానే ఈ రోజు కూడా తన నివాసం నుంచి బయటకు వచ్చి, పాదయాత్రకు ముద్రగడ బయల్దేరారు. ఇంటి గేటు వద్దకు వచ్చేసరికి ఓఎస్డీ రవిశంకర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని మరోసారి చెప్పారు. దీంతో, ప్రభుత్వంపై ముద్రగడ మరోసారి మండిపడ్డారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తోనే తాము శాంతియుత పాదయాత్రను చేపట్టామని... తమ యాత్రను అడ్డుకోవడం నిరంకుశ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మరాఠాలు తమ హక్కుల కోసం ఎన్నో ప్రదర్శనలు చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వాలు అడ్డుకోవడం లేదని చెప్పారు.