: ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టగానే ఆధార్... పంజాబ్ ప్రభుత్వం కొత్త విధానం
ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు జన్మించిన వెంటనే వారికి ఆధార్ జారీ చేయనున్నట్లు పంజాబ్ ఆరోగ్య మంత్రి బ్రహ్మ్ మోహీంద్ర తెలిపారు. దీంతో ఆధార్ నమోదు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆయన చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి తాము ఈ పని చేపడుతున్నట్లు మోహీంద్ర వివరించారు. దీని వల్ల ప్రతి నెల పంజాబ్ ఆసుపత్రుల్లో జన్మిస్తున్న పిల్లలు లాభపడతారని ఆయన పేర్కొన్నారు.