: ప్రపంచంలోనే అతిపెద్ద వయస్కుడు ఇక లేడు.. 113 ఏళ్ల ఇజ్రాయెలీ మృతి!


ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఇజ్రాయిల్ క్రిస్టల్ మృతి చెందారు. 113 ఏళ్ల ఆయన ఇక లేరని ఇజ్రాయెలీ మీడియా తెలిపింది. 114వ బర్త్‌డేకు ముందే ఆయనే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. యూదు మతస్తుడైన ఆయనకు ఇద్దరు సంతానం. 9 మంది మనవలు, 32 మంది ముని మనవలు ఉన్నారు. క్రిస్టల్ సెప్టెంబరు 15, 1903న జన్మించారు. అంటే రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టడానికి మూడు నెలల ముందన్నమాట. అతడిని  ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న వ్యక్తిగా గతేడాది మార్చిలో గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తించింది.

  • Loading...

More Telugu News