: తయారీ రంగంలో మమ్మల్ని చేరలేరు.. కావాలంటే భారత్‌కు ఓ అడ్డదారి ఉంది!: చైనా పత్రిక వ్యంగ్య కథనం

భార‌త్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తోన్న చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ రోజు మ‌రోసారి ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. తయారీ రంగంలో తమను చేరుకోవాలంటే భార‌త్‌కు ఇప్ప‌ట్లో అయ్యే ప‌నికాద‌ని పేర్కొంది. త‌మ దేశంలోని ఇండస్ట్రియల్ చైన్ కారణంగా అక్క‌డ త‌యార‌య్యే వ‌స్తువుల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని, భారత్‌లో అది సాధ్యం కాదని విమ‌ర్శ‌లు చేసింది. ప్రపంచ తయారీ హబ్‌‌గా మారేందుకు భారత్‌కు చాలా ఏళ్లు పడుతుందని పేర్కొంది. కాక‌పోతే భారత్‌కు ఓ అడ్డదారి ఉందంటూ ఓ ఉచిత స‌ల‌హా ఇచ్చింది.

విదేశీ పెట్టుబడులతో భారత్ సులువుగా గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారవచ్చని ఆ క‌థ‌నంలో పేర్కొంది. వినియోగదారుల మార్కెట్ పరిణితి చెందితే భార‌త్‌ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని రాసుకొచ్చింది. భార‌త్‌లో విక్ర‌యిస్తోన్న త‌మ వ‌స్తువులు చ‌వ‌క‌గా దొరుకుతుండ‌డంతో వాటిని వాడేందుకు ఎంతో మంది ఆస‌క్తిక‌న‌బ‌రుస్తున్నార‌ని పేర్కొంది. డోక్లాం వివాదం నేపథ్యంలో త‌మ‌దేశ వ‌స్తువుల‌ను వాడ‌వ‌ద్ద‌ని ఇండియాలోని కొంద‌రు అతివాదులు వాపోతున్నార‌ని అంది.

More Telugu News