: ‘థ్యాంక్యూ కెప్టెన్’ అంటూ రాజమౌళికి రానా రిప్లై


‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్ర దర్శకుడు తేజ, నటీనటులు, ముఖ్యంగా భళ్లాలదేవా రానా నటనపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా కితాబిచ్చిన కొంచెం సేపటికే రానా స్పందించారు. ట్విట్టర్ ద్వారా రానా రిప్లై ఇస్తూ..‘థ్యాంక్యూ కెప్టెన్!! నేను కొత్త పాత్రల్లో నటించేందుకు ప్రయత్నించడానికి.. భళ్లాలదేవా పాత్ర నాకు ఒక ఆయుధం లాంటిది!! నేనే రాజు నేనే మంత్రి సినిమా మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది!’ అని అన్నాడు. ‘ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ, చూడాలని నిర్ణయించుకున్నవారికి నా ధన్యావాదాలు’, ‘మూసధోరణి తెలుగు సినిమాలను ఈ సినిమా బ్రేక్ చేసింది. కేవలం ప్రేక్షకుల, అభిమానుల మద్దతు వల్లే ఈ తరహా వినూత్న పాత్రలను పోషిస్తాను’ అని రానా ఆయా ట్వీట్లలో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News