mahesh babu: మహేశ్ కాబట్టి విలన్ గా చేశాను .. ఇకపై చేయను : భరత్

తమిళంలో హీరోగా భరత్ పలు వైవిధ్యభరితమైన సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన కొన్ని అనువాద చిత్రాల ద్వారా పరిచయమే. అలాంటి భరత్ .. 'స్పైడర్' మూవీలో ఒక విలన్ గా చేశాడు. మెయిన్ విలన్ గా ఎస్.జె. సూర్య చేయగా .. మరో విలన్ గా భరత్ కనిపించనున్నాడు.

మురుగదాస్ అడగడమే ఆలస్యం, మరో ఆలోచన లేకుండా తాను ఈ సినిమా చేశానని భరత్ అన్నాడు. మహేశ్ కాంబినేషన్లో నేరుగా తెలుగు సినిమా చేసినందుకు తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. తాను తమిళంలో హీరోగా చేస్తున్నా .. మహేశ్ కోసమే విలన్ గా చేయడానికి ఓకే చెప్పానని అన్నాడు. ఈ సినిమా తరువాత మళ్లీ విలన్ వేషాల జోలికి వెళ్లనని తేల్చి చెప్పాడు. ఈ సినిమాలో విలన్ గా ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.    
mahesh babu
rakul

More Telugu News