: ఎనిమిది నెలల చిన్నారిని ఫ్రిజ్లో పెట్టి హింసించిన యువతులకు జైలు శిక్ష
అమెరికాలోని మసాచుసెట్స్ ప్రాంతంలో ఎనిమిది నెలల చిన్నారిని ఫ్రిజ్లో పెట్టి హింసించిన ఇద్దరు మైనర్ బాలికలకు ఆ ప్రాంత కోర్టు శిక్ష విధించింది. వీరు చిన్నారిని ఫ్రిజ్లో పెట్టి హింసిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్రిజ్లో చల్లదనం తట్టుకోలేక ఏడుస్తున్న చిన్నారిని వీడియోలో చూడొచ్చు. ఆ చిన్నారికి సంరక్షకులుగా పనిచేస్తున్న యువతులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి అమెరికా చట్టం ప్రకారం పసిపిల్లలను హింసించిన నేరం కింద శిక్ష విధించారు. నిందితురాళ్లిద్దరూ మైనర్లు కావడంతో వారికి సంబంధించిన వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు వారు తెలియజేశారు.