: ఓలా 'షేర్‌', ఉబెర్ 'పూల్' వాడుతున్నారా!.... అయితే చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌ట్లే!

క్యాబ్ సంస్థ‌లు ప్ర‌వేశ‌పెట్టిన పూలింగ్‌, షేరింగ్ సౌక‌ర్యాల వ‌ల్ల చాలా లాభాలున్నాయి. ఎక్కువ దూరాన్ని త‌క్కువ ఖ‌ర్చుతో చేరుకునే స‌దుపాయం ఉండ‌టం వ‌ల్ల చాలా మంది ఈ సేవ‌లను ఉప‌యోగించుకోవ‌డానికి ముందుకొస్తున్నారు. కాక‌పోతే ఈ సేవ‌ల‌ను వాడుతున్న వారంద‌రూ త‌మ‌కు తెలియ‌కుండానే చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఓలా షేర్‌, ఉబెర్ పూల్ సేవ‌ల ద్వారా భార‌త మోటార్ వెహిక‌ల్ చ‌ట్టం సెక్ష‌న్ 66ను ప‌రోక్షంగా ఉల్లంఘిస్తున్నారు.

 ఈ చ‌ట్టం ప్ర‌కారం ప్రైవేట్ వాహ‌నాల్లో ఇలా ప్ర‌యాణికులను ఎక్కించుకోవ‌డం మ‌ధ్య‌లో దింపి, వేరే వాళ్ల‌ను ఎక్కించుకోవ‌డం నిషిద్ధం. సాధార‌ణంగా దేశంలో క్యాబ్‌ల‌న్నింటికీ కాంట్రాక్ట్ క్యారేజ్ ప‌ర్మిట్ మాత్ర‌మే ఉంటుంది. దీని ప్ర‌కారం క్యాబ్ వాహ‌నాలు ప్ర‌యాణికుల‌ను ఒక చోట ఎక్కించుకుని వారి గ‌మ్య‌స్థానంలో చేర్చాలి. అంతే త‌ప్ప మ‌ధ్య‌లో ఎవ‌ర్నీ ఎక్కించుకోకూడదు. ఒక‌వేళ ఓలా షేర్‌, ఉబెర్ పూల్ వంటి స‌దుపాయాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త కావాలంటే భార‌త మోటార్ వెహిక‌ల్ చ‌ట్టం ప్ర‌కారం స్టేజ్ క్యారేజ్ ప‌ర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రాష్ట్రం ఈ చ‌ట్టానికి విరుద్ధంగా ఉన్నాయ‌ని ఉబెర్‌పూల్‌, ఓలా షేర్‌ల‌ను నిషేధించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ స‌దుపాయాల వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదాలు, ఇబ్బందులు క‌ల‌గ‌లేదు కాబ‌ట్టి ఇత‌ర రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఈ చ‌ట్టాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

More Telugu News