: ఓపీఎస్, ఈపీఎస్ ల కలయికపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
అన్నాడీఎంకేలోని ఇరు వర్గాల కలయికకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల వర్గాలు ఒక్కతాటిపైకి రానున్నాయి. తద్వారా శశికళ, దినకరన్ లను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వీరి కలయికపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీనం అనే పదం తనకు చాలా విచిత్రంగా అనిపిస్తోందని ఆయన అన్నారు. వీరిది కచ్చితంగా విలీనం కాదని తెలిపారు.
కేవలం ఒక్క వ్యక్తి ఎలా విలీనం అవుతారంటూ పన్నీర్ సెల్వంను ఉద్దేశించి అన్నారు. కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా పన్నీర్ తయారు చేయలేరని చెప్పారు. తాము విలీనం అవుతున్నట్టు ఆయనేమైనా ప్రకటన చేశారా? అంటూ మీడియాను ప్రశ్నించారు. ఈ తతంగం మొత్తాన్ని ఇప్పటివరకు మీడియానే నడిపించిందని... ఇప్పటిదాకా వారిద్దరూ కలిశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోకి రావడానికి పన్నీర్ సెల్వం తహతహలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు, ఉప రాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణస్వీకారం సందర్భంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు. వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పళని సీఎంగా కొనసాగుతారని, పన్నీర్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన ఆర్థిక, పీడబ్ల్యూడీ శాఖలను కట్టబెడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అనంతరం ఎన్డీయేలో అన్నాడీఎంకే చేరుతుందని చెబుతున్నారు.