: ఆత్మహత్య చేసుకున్న మరో ఐఏఎస్ అధికారి
మరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీహార్లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న ముఖేష్ పాండే... వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృత దేహాన్ని నిన్న జీఆర్పీ పోలీసులు ఢిల్లీ శివారులోని ఘజియాబాద్ స్టేషన్ కు సమీపంలో గుర్తించారు. ఆయన జేబులో ఒక కాగితాన్ని గుర్తించిన పోలీసులు... దాని ఆధారంగా ఆయన బస చేసిన హోటల్ గదికి వెళ్లి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
2012 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారినైన తాను ప్రస్తుతం బీహర్ లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయాలని చెప్పారు. మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేదని... బతకాలనే కోరిక చచ్చిపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు.
మరోవైపు, కేవలం ఆత్మహత్య చేసుకోవడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు ఆయన తన మిత్రులతో మాట్లాడినట్టు పోలీసులు వెల్లడించారు. తాను 10 అంతస్తుల షాపింగ్ మాల్ పై నుంచి దూకి చనిపోబోతున్నట్టు ఓ స్నేహితుడికి చెప్పాడు. దీంతో, అతను వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం అందించారు. షాపింగ్ మాల్ సీసీటీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు... అతను మెట్రో స్టేషన్ కు వెళుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత అతని జాడ దొరకలేదు. చివరకు ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో విగతజీవిగా కనిపించాడు. ఇటీవల కాలంలో యువ ఐఏఎస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై దృష్టి సారించింది.