sridevi: వాటి గురించి మా పిల్లలకి ముందే చెప్పాను : శ్రీదేవి

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున తనకి తగిన కథలను ఎంచుకుంటూనే, మరో వైపున కూతురు జాన్వీని వెండితెరకి పరిచయం చేసే సమయం కోసం శ్రీదేవి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీపై ఏవేవో పుకార్లు బాలీవుడ్లో  షికారు చేస్తున్నాయి. అయితే వాటి గురించి శ్రీదేవి కూడా పెద్దగా పట్టించుకోరు. రీసెంట్ గా ఆమె ఒక రూమర్ పట్ల మాత్రం తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శించారు. ఈ మధ్య జరిగిన ఒక పార్టీలో రణబీర్ కపూర్ వెంట జాన్వీ కపూర్ పడినట్టుగా ఒక ప్రచారం జరిగింది.

 దానికి శ్రీదేవి తనదైన శైలిలో స్పందించారు. అక్కడ అలాంటిదేం జరగలేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పుకార్లు స్టార్స్ పిల్లలను తరుముతూ వస్తాయనీ, వాటిని చూసి కంగారుపడిపోవలసిన పనిలేదని ఆల్రెడీ తాను తమ పిల్లలకి చెప్పానని అన్నారు. పుకార్లను విని తట్టుకునే శక్తిని .. వాటిని లెక్కచేయకుండా ముందుకుసాగే విధానాన్ని తాను తన పిల్లలకు చెప్పాను గనుక, ఇలాంటి వాటి గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరని తేల్చి చెప్పేశారు. 
Go Back to Shorts
sridevi

More Telugu News