: చైనా ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన భారత్!


డోక్లాం వివాదం విషయంలో చైనా చేసిన తాజా ప్రతిపాదనని భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అంతేకాదు, సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తోంది. సరిహద్దుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాతాంగ్‌ గ్రామంలో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆ గ్రామాన్ని భారత సైనికులు ఖాళీ చేయిస్తున్నారు. అంతే కాకుండా డోక్లాంకు 33 కార్ప్‌ సైనికులను తరలిస్తున్నారు.

అదే సమయంలో 'మీరు 100 మీటర్లు వెనక్కి తగ్గండి... మేము 100 మీటర్లు వెనక్కి తగ్గుతాం' అంటూ తాజాగా చైనా చేసిన ప్రతిపాదనను కూడా భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దాని స్థానంలో మరో ప్రతిపాదన పంపింది. 'వెనక్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు 100 మీటర్లు ఎందుకు, 250 మీటర్లు మీరు వెనక్కి వెళ్లండి, మేమూ వెళ్తాం' అంటూ భారత్ స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News