: చిత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన అపూర్వ టెక్స్‌టైల్స్.. రూ.6 కోట్ల నష్టం.. కనిపించకుండా పోయిన వాచ్‌మన్!


చిత్తూరు చర్చి వీధిలోని అపూర్వ టెక్స్‌టైల్స్‌ షోరూంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని రెండు అంతస్తులు కాలి బూడిదయ్యాయి. ఆరు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం వెనక కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్స్‌టైల్ షోరూం వాచ్‌మన్ రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News