: జగన్ వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన మంత్రి భూమా అఖిలప్రియ


కర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ నేపథ్యంలో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి  చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ మండిప‌డ్డారు. చంద్రబాబును ఉరితీసినా తప్పులేదంటూ జగన్ ఈ రోజు మ‌రోసారి తీవ్ర‌ వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో నంద్యాలలోని తొమ్మిదోవార్డులో అఖిలప్రియ త‌మ కార్య‌క‌ర్త‌లతో కలిసి రోడ్డుపై కూర్చుని ఆందోళనకు దిగారు. చంద్రబాబుపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలు అభ్యంత‌ర‌కర‌మ‌ని ఆమె అన్నారు. జగన్ ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆమె అన్నారు. 

  • Loading...

More Telugu News