bellamkonda: నాలుగు సీన్ల పాత్ర చేసినందుకు ఆమెకి 40 లక్షలు?

షార్ట్స్‌లో చూడండి
సీనియర్ కథానాయికలు చాలామంది రీ ఎంట్రీ ఇచ్చి .. తమ వయసుకు తగిన కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా 'జయ జానకి నాయక' సినిమాతో వాణీ విశ్వనాథ్ కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నిన్నటి తరం కథానాయికగా వాణీ విశ్వనాథ్ కి మంచి క్రేజ్ వుంది. అలాంటి ఆమె బోయపాటి శ్రీను సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

 ఈ సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్రను పోషించిందట. ఆమె కనిపించేది నాలుగు సీన్లే అయినా 40 లక్షలను పారితోషికంగా ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే కథానాయికలతో సమానమైన పారితోషికం ఇచ్చుకోవలసి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రకుల్ .. ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, కేథరిన్ స్పెషల్ సాంగ్ చేసిందనే సంగతి తెలిసిందే.    
Go Back to Shorts
bellamkonda
rakul

More Telugu News