: ఒకే వేదికపై కమల్, రజనీ... తమిళ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం!
తమిళ ప్రజలు ఆరాధించే నటులు కమల్ హాసన్, రజనీకాంత్‌లు ఇవాళ సాయంత్రం ఒకే వేదికపై కనిపించనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే తమ పార్టీ పత్రిక `మురసోలి` ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈవెంట్ లో కమల్, రజనీలు పాల్గొననున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కమల్ ఈ వేదిక మీద మాట్లాడనున్నట్లు సమాచారం.
అలాగే పొలిటికల్ ఎంట్రీ గురించి కొద్ది కాలంగా ఊరిస్తున్న రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి రానుండటంతో, ఈ సమావేశం తమిళ రాజకీయాల సమీకరణాలను మార్చే అవకాశం కలిగిస్తుందని విశ్వసనీయ వర్గాల అభిప్రాయం. కాకపోతే ఈ వేదిక మీద రజనీకాంత్ ఎలాంటి ప్రసంగం చేయబోరని తెలుస్తోంది. అధికారపక్షం అన్నాడీఎంకేకి, ఈ సినీనటులు ఎప్పట్నుంచో వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.