: శశికళకు షాక్.. దినకరన్ ఔట్.. ఒక్కటైన పన్నీర్, పళని!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, దినకరన్ లను పూర్తిగా సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ నియామకం చెల్లదంటూ తీర్మానం చేశారు. దినకరన్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం ఈ తీర్మానం చేసింది. మరోవైపు పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనుందని విశ్వసనీయ సమాచారం. పళనిస్వామి ముఖ్యమంత్రిగానే కొనసాగుతారని, పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎం, లేదా బీజేపీతో పొత్తులో భాగంగా కేంద్ర మంత్రి పదవిని కానీ కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.