dhanush: ఇక ఆగేది లేదంటూ వెబ్ సిరీస్ లోకి ధనుష్ !

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, హిందీ ప్రేక్షకులకి కూడా బాగా పరిచయమే. నటుడిగానే కాదు దర్శక నిర్మాతగా ధనుష్ కి మంచి అనుభవముంది. అలాంటి ధనుష్ ఇప్పుడు వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే ఆయన వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేయాలనుకున్నాడట. అయితే అప్పుడున్న కమిట్మెంట్స్ వలన అది సాధ్యపడలేదు.

 ఈ లోగా తన దర్శకత్వంలో వచ్చిన 'పా పాండి' హిట్ కావడంతో తనపై తనకి మరింత నమ్మకం పెరిగిందట. దాంతో వెబ్ సిరీస్ ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఒక రచయితల బృందాన్ని ఏర్పాటు చేసుకుని, వాళ్ల నుంచి మంచి కంటెంట్ ను రాబట్టే ప్రయత్నంలో వున్నాడట. వచ్చే ఏడాది ఇది కార్యరూపం దాల్చవచ్చని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ధనుష్ నటించడట .. దర్శకత్వం మాత్రమే చేస్తాడట.   
dhanush

More Telugu News