: 'లై' సినిమా విడుదలకు ముందే.. శుభవార్త విని పట్టరాని సంతోషంలో ఉన్న దర్శకుడు హను రాఘవపూడి!


నితిన్, మేఘా ఆకాశ్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది. సినిమా ఇంకా విడుదల కాకముందే దర్శకుడు హను రాఘవపూడి వ్యక్తిగత జీవితంలో పెద్ద శుభవార్త విన్నాడు. దీంతో ఆనందం పట్టలేకపోతున్నాడు. సినిమా కూడా హిట్ అయితే హను రాఘవపూడికి డబుల్ బొనాంజా లభించినట్టే.

ఇక ఆ శుభవార్త వివరాల్లోకి వెళ్తే...'లై' సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే అమూల్యతో హనుకి వివాహం జరిగింది. ఈ రోజు ఆమె హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. దీంతో సినిమా విడుదలకు ముందే తన జీవితంలోకి కొడుకు వచ్చి ఆనందం నింపాడని హను రాఘవపూడి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 

  • Loading...

More Telugu News