: మైదానంలో కోహ్లీ ప్రతిసారీ కోపం ప్రదర్శించడం మంచిదికాదు: రణతుంగా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై శ్రీలంక క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ పలు వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో కోహ్లీ తీరుపై ఆయన స్పందిస్తూ.. పదే పదే కోపం ప్రదర్శించడం మంచిది కాదని అన్నాడు. ఒక బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్‌గా గుర్తింపు పొందేందుకు మాత్రం ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందని చెప్పాడు. కోహ్లీకి కెప్టెన్సీ గురించి తాను ఇప్పట్లో ఏ రేటింగ్ ఇవ్వలేనని అన్నాడు. కోహ్లీని భారత మాజీ కెప్టెన్లు అజహరుద్దీన్, ధోనీ వంటి వారితో పోల్చడం కంటే తన తరం కెప్టెన్ కపిల్‌దేవ్‌తో పోల్చితే బాగుంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించాడు.