: రెండు విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీ!
రెండు విమానాల రెక్కలు ఒకదానికికొకటి ఢీ కొన్న ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఇథియోఫియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల రెక్కలు ఢీ కొన్నాయని వివరించారు. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా విమానానికి చెందిన ఎడమవైపు రెక్క కొద్దిగా కిందకు వంగిపోయిందని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నాలుగు నెలల క్రితం కూడా ఇదే విమానాశ్రయంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది.