sudeep: 'ఉయ్యాలవాడ'లో సుదీప్ చేయడం లేదట!

షార్ట్స్‌లో చూడండి
కన్నడలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతోన్న సుదీప్, తెలుగులో అవకాశం వచ్చినప్పుడల్లా పాత్రల పరంగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే వున్నాడు. అలాంటి సుదీప్ .. 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆంగ్లేయులకు సహకరించే ఓ పాత్ర కోసం ఆయనని సంప్రదించగా ఓకే చెప్పాడని టాక్ వచ్చింది.

 అయితే ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదన్నది తాజా సమాచారం. ఈ సినిమాలో సుదీప్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక ఉపేంద్రను తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇంకో కీలకమైన పాత్ర కోసం అమితాబ్ ను సంప్రదించడం మాత్రం నిజమని తెలుస్తోంది. మరి అమితాబ్ ఓకే చెబుతారో .. లేదో చూడాలి.   
Go Back to Shorts
sudeep

More Telugu News