: ఈ ఫోటోలు మీ నాన్నకి చూపించావా?: బాలీవుడ్ హీరోయిన్ పై చిందులు తొక్కుతున్న అభిమానులు


బాలీవుడ్ నటి ఇషా గుప్తా అభిమానుల ఆగ్రహం చవిచూస్తోంది. గతంలో దుస్తులపై ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే, సనా షేక్ విమర్శలు ఎదుర్కోగా, తాజాగా ఇన్ స్టా గ్రాంలో ఫోటోలపై ఇషా గుప్తా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మోడల్ గా పని చేసి, సినిమాల్లోకి వచ్చిన ఇషా గుప్తా తాజాగా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ ఇంచుమించు టాప్ లెస్ గా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రాం పేజ్ లో పోస్టు చేసింది.

దీంతో ఆమె అభిమానులు భగ్గుమన్నారు. ఈ ఫోటోలను మీ నాన్నకు చూపించావా? అని ఒక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బు కోసం పేరు కోసం ఇవన్నీ చేస్తున్నావని మీ కుటుంబ సభ్యులకు చెప్పావా? అని మరికొందరు ప్రశ్నించారు. ఇంకొందరు అభిమానులు 'ముందు ఆమెకి సినిమాల్లో అవకాశాలు ఎవరైనా ఇవ్వండి, లేకపోతే నగ్నంగా తిరిగేలా ఉంది...' అని విమర్శించారు. 'ఆమె పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటుందేమో?' అంటూ మరొక అభిమాని విమర్శించగా, ఒక అభిమాని 'ఆమె డిక్షనరీలో సిగ్గు అన్న పదం తీసేసినట్టుంద'ని అన్నాడు. 

  • Loading...

More Telugu News