: బాలుడి ప్రాణం తీసిన పరుగు పందెం!
పరుగు పందెంలో పాల్గొన్న ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా గూడూరులో ఈ రోజు చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ విద్యార్థి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తోన్న సందర్భంగా స్కూల్‌లో ఆటలపోటీలు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. గతంలో తమ కుమారుడికి ఆరోగ్య సమస్య కూడా లేదని అన్నారు.