sai dharam thej: వినాయక్ తో తేజు న్యూ మూవీ మొదలైపోయింది!

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమా చేసిన వినాయక్, తన తదుపరి సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. సాయిధరమ్ తేజ్ తో ఆయన ఒక సినిమా చేసే ఛాన్స్  వున్నట్టుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. అది నిజమేనంటూ ఈ కాంబినేషన్ ఈ రోజున సెట్స్ పైకి వచ్చింది.

 సి. కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కొంతసేపటి క్రితం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ఆశీస్సులు అందజేశారు.    
Go Back to Shorts
sai dharam thej

More Telugu News