: తిరుమలకు తుపాకితో వచ్చి దొరికిపోయిన మహారాష్ట్ర భక్తుడు!


తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ భక్తుడు, తన వెంట రివాల్వర్ తో రావడం కలకలం రేపింది. భద్రతా విభాగ అధికారి రవికృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర నుంచి తమ సొంత వాహనంలో అలిపిరికి వచ్చిన ఓ కుటుంబం, కారులోని సీటు కింద లైసెన్స్ ఉన్న రివాల్వర్ ను దాచింది. దానిలో ఆరు బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి.

తనిఖీలు నిర్వహించిన కానిస్టేబుల్ ఒకరు అనుమానంతో సీటు కింద చూసి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు. తుపాకీ లైసెన్స్ మహారాష్ట్ర వరకూ మాత్రమే పరిమితమైనదని, ఇతర రాష్ట్రాల్లో దాన్ని వాడరాదని, ఆయుధాల చట్టం ప్రకారం, ఆ భక్తుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని రవికృష్ణ వెల్లడించారు. తనిఖీల విషయంలో తాము మరింత కఠినంగా ఉంటామని, భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News